April 8, 2026
Explore
ఆర్టీసీ బస్సు ఢీ కొని కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం!

ఆర్టీసీ బస్సు ఢీ కొని కాలు కోల్పోయిన వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం!

April 8, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి సీహెచ్ మహేశ్వరరావుకు దాదాపు రూ.89 లక్షల( 88,94,658) పరిహారం చెల్లించాలని TGSRTCకి సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి గురై ఉద్యోగం కోల్పోయిన మహేశ్వరరావు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. బాధితుడి పరిస్థితి, వైద్య ఖర్చులు, భవిష్యత్తు ఆదాయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తీర్పు అమలు అయ్యే వరకు 9 శాతం వడ్డీతో కూడిన మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది..

Tags: ₹89 Lakhs Compensation for Man Who Lost a Leg After Being Hit by an RTC Bus!