అమరావతిముచ్చట్లు:
దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252.93 కోట్లతో ఆధునీకరిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా తొలిదశలో రూ.18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్ పంప్‌లు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసింది.
ఈ సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి నూతన వాహనాలను జెండా ఊపి ప్రారంభించాను. విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలని…కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సిబ్బందికి, అధికారులకు సూచించాను.
Tags: 25 Advanced Fire Tenders at a Cost of Rs 18 Crores