April 8, 2026
Explore
సమస్యల పైన వినతి పత్రం

సమస్యల పైన వినతి పత్రం

April 8, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో RMB గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాదిగల సమస్యలపైన MDPS రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ అన్న ఆదేశాల మేరకు వివిధ సమస్యల పైన వినతి పత్రం ఇచ్చిన MDPS ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ పురుషోత్తం చిత్తూరు జిల్లా అధ్యక్షులు మాధవ ఉపాధ్యక్షులు హరి ప్రసాద్ బంగారుపాలెం మండలం ప్రధాన కార్యదర్శి చంద్రయ్య చంద్రశేఖర్ పలమనేరు నియోజకవర్గం నాయకులు మణి,పుంగనూరు నాయకులు నాగరాజన్న అదేవిధంగా బాధితులు సాలమ్మ, కృష్ణయ్య వీరందరూ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అధికారులు నిర్లక్ష్యం వల్ల పేదల భూములు కబ్జాలకు గురవుతున్నదని వీటిపైనా దృష్టి పెట్టి సంబంధిత కలెక్టర్ కి మీ ద్వారా తెలియజేసి పేదల సమస్యలు పరిష్కరించాలని కోరడమైనది. ఎస్సీ కమిషన్ చైర్మన్ స్పందించి ఈ సమస్యలను ఈ అర్జీలను జిల్లా కలెక్టర్ గారికి పంపించి త్వరగా పేదల సమస్యలు పరిష్కరించాలని చెబుతానని చెప్పడం జరిగింది..

Tags; Petition Regarding Issues