April 8, 2026
Explore
మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ ప్రారంభం.

మదనపల్లిలో అత్యాధునిక ‘క్రైమ్ పోలీస్ స్టేషన్’ ప్రారంభం.

April 8, 2026 | Andhra Pradesh

💠రిబ్బన్ కత్తిరించి ప్రారంభించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

👉నేరాల నియంత్రణ, ఆస్తిపాస్తి కేసుల ఛేదనలో వేగం.

👉స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ

మదనపల్లి ముచ్చట్లు:

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పెండింగ్‌లో ఉన్న క్లిష్టమైన నేర పరిశోధనలను త్వరితగతిన కొలిక్కి తెచ్చేందుకు మదనపల్లిలోని బీటీ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్’ ను బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఘనంగా ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పీ రిబ్బన్ కత్తిరించి స్టేషన్‌లోకి ప్రవేశించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఆయన మొక్కను నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న చోరీలు, కఠినమైన ఆస్తిపాస్తి నేరాలు (ప్రాపర్టీ అఫెన్సెస్) మరియు దీర్ఘకాలంగా పరిష్కారం కాని కేసులను వేగవంతంగా ఛేదించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక క్రైమ్ స్టేషన్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు.

ఎస్పీ క్రైమ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తో మాట్లాడుతూ.. “నేరస్థులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేలా ఈ క్రైమ్ స్టేషన్ పనిచేయాలి. టెక్నాలజీని వాడుకుంటూ, క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలతో నేరాలను ఛేదించి, ప్రజల సొత్తును వారికి అప్పగించడంలో క్రైమ్ విభాగం కీలక పాత్ర పోషించాలి. అధికారులకు, సిబ్బందికి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాం, ఇకపై ఫలితాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజలో ఉండాలి.” అని ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా క్రైమ్ ఇన్స్‌పెక్టర్ ఎం. చంద్రశేఖర్, వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ కె. రాజారెడ్డి, తాలూకా ఇన్స్‌పెక్టర్ కె. కళా వెంకటరమణ, డిసిఆర్బి ఇన్స్‌పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ఏ. మోహన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే క్రైమ్ ఎస్ఐలు నరసింహుడు, మోహన్ నాయక్, రమేష్, తాలూకా ఎస్ఐ రామకృష్ణారెడ్డి మరియు సిసిఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:State-of-the-art ‘Crime Police Station’ inaugurated in Madanapalle.