అమరావతిముచ్చట్లు:
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు.
రాష్ట్రంలో సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించే వార్త తెలిపారు.
కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన చేశారు.
ఆర్టీజీఎస్ అభివృద్ది చెందిన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు.
అనంతరం వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో మరో 5 లక్షల ఇళ్లను నిర్మించాలని, వీటిని పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
టిడ్కో ఇళ్లకు అదనంగా ఈ 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
వీలైనంత త్వరగా వీటిని లబ్దిదారులకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
దాదాపు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కావాల్సిందిగా కోరారని, వీరికి అందించేలా ప్రణాళికలు రచించాలని కోరారు.
Tags: CM Chandrababu Shares Key Update on New Houses!