రాయచోటి ముచ్చట్లు:
2026-2027 విద్యా సంవత్సరానికి డి.ఎడ్ (D.El.Ed) కోర్సులో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం రాయచోటి బాలికోన్నత పాఠశాలలో ప్రవేశాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ సంస్థల్లో రెండేళ్ల కోర్సు కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ అని పేర్కొన్నారు. ఇతర వివరాలకు డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి (9440246825) ని సంప్రదించాలని కోరారు.
Tags:Applications Invited for Admission into D.Ed. Course