April 7, 2026
Explore
చీమనపల్లెలో జరిగే ఉరుసుకు సర్వం సిద్ధం

చీమనపల్లెలో జరిగే ఉరుసుకు సర్వం సిద్ధం

April 7, 2026 | Andhra Pradesh

10 నుంచి 12 వరకు మూడు రోజులు

  • వేలాదిగా తరలిరానున్న భక్తజనం

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసియున్న హజ్రత్‌జాన్‌పాక్‌షావలిబాబా, ఫకీర్‌షావలిబాబా వారి ఉరుసు ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు జరగనున్నట్లు కమిటి అధ్యక్షుడు అష్రఫ్‌ తెలిపారు. మంగళవారం దర్గాను విద్యుత్‌ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో పూజలు నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది ముస్లింలు ఉరుసు మహోత్సవంలో పాల్గొనేందుకు దర్గా ప్రాంతం చేరుకుంటున్నారు. అందరికి భోజన, వసతి సౌకర్యాలను దర్గా కమిటి ఏర్పాటు చేశారు.

మూడు రోజులు ఉరుసు….

దర్గా కమిటి అధ్యక్షుడు అష్రఫ్‌ విలేకరులతో మాట్లాడుతూ 10న రాత్రి గంధం, ఫకీర్ల వాయిద్యాలు , బాణసంచాలు, విద్యుత్‌ దీపాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి దర్గాలో ఉరుసు మహ్గత్సవాన్ని ప్రారంభిస్తామన్నారు. 11, 12వ తేదీలలో ముంబైకి చెందిన అఫ్రిన్‌సుల్తాన, మైసూర్‌కు చెందిన సలీంరిష్టి, గుజరాత్‌కు చెందిన ఆసిఫ్‌అజ్మీర్‌, ఇంతేజుర్‌రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలమనేరు డిఎస్పీ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టారు.

మూడు రోజులు అన్నదానం….

చీమనపల్లెలో జరుగుతున్న ఉరుసు మహోత్సవానికి వచ్చే వేలాది మంది భక్తులకు మూడు రోజులు 10వ తేదీ రాత్రి నుంచి 12 వ తేదీ రాత్రి వరకు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అష్రఫ్‌ తెలిపారు. ఈ ఉరుసు కార్యక్రమంలో హిందూముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏర్పాట్లలో దర్గా కమిటి సభ్యులు నిమగ్నమైయ్యారు.

Tags: All arrangements are complete for the Urs to be held in Cheemanapalle.