April 7, 2026
Explore
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

April 7, 2026 | Andhra Pradesh

గుర్రంకొండ ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ గ్రామీణ ప్రజలు యువకులు, విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాయల్పాడు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. గుర్రంకొండ మండలం, పిల్లగోగులవారిపల్లి, ఇరగన్నగారిపల్లి, బోడిగుట్టగ్రామాల్లో సైబర్ క్రైమ్, వాట్సాప్ లింకులు, దొంగతనాలపై అవగాహన కల్పించారు. యాపులతో అప్రమత్తంగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. ప్రజలు సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని గుర్తుచేశారు. సమావేశంలో ప్రజలు విద్యార్థులు పాల్గన్నారు.

Tags: One must be vigilant against cyber frauds.