ముగ్గురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
పలాసముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెమలి నారాయణపురం సమీపంలోని జాతీయ రహదారి పై ఒక్కసారిగా అదుపుతప్పిన ఇన్నోవా కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టి, అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని దర్శనం ముగించుకుని, తిరిగి పర్లాఖిమిండి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో పలాస పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్డుపై అదుపు కోల్పోయిన వాహనం, వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొడుతూ అవతలి వైపు మార్గంలోకి వెళ్ళింది. అదే సమయంలో వస్తున్న లారీని బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి వర్షం మరియు అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags; Horrific Road Accident in Srikakulam District