April 7, 2026
Explore
అర్జీలు సత్వరమే పరిష్కరించండి

అర్జీలు సత్వరమే పరిష్కరించండి

April 7, 2026 | Andhra Pradesh

123 అర్జీలు స్వీకరణ

శ్రీకాకుళం ముచ్చట్లు:

జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ జయదేవి, అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్లు జయదేవి మరియు డిప్యూటీ కలెక్టర్ పద్మావతిలు 123 అర్జీలు స్వీకరించారు.

ఈ అర్జీలలో ప్రధానంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవారిటీ 31,రెవెన్యూ శాఖ 18, పంచాయతీ రాజ్ 16, రూరల్ వాటర్ సప్లై ఇంజనీరింగ్ 7, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 6, మునిసిపల్ శాఖ 6, విద్యుత్ శాఖ 4, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 4, రోడ్లు మరియు భవనాల శాఖ 4, రూరల్ డెవలప్మెంట్ 4, వాటర్ రిసోర్స్ 4,వ్యవసాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2 , మార్కెటింగ్ , డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ , కోపరేటివ్ సొసైటీ, సైనిక్ వెల్ఫేర్ , సివిల్ సప్లై , ఫైనాన్స్ , రోడ్డు రవాణా, ఫారెస్ట్ మరియు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు ఒక్కొక్క దరఖాస్తు చొప్పున స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి 123 అర్జీలు స్వీకరించారు.ఈ అర్జీలు స్వీకరించిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: Resolve petitions promptly.