April 6, 2026
Explore
రీ-సర్వే తప్పులపై తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

రీ-సర్వే తప్పులపై తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

April 6, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోటమండలంలోని శీలంవారిపల్లి పంచాయతీ రైతులు రీ-సర్వే అక్రమాలపై సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నోటీసులు ఇవ్వకుండానే సర్వే చేయడం వల్ల భూ విస్తీర్ణం, యజమానుల వివరాల్లో తీవ్రమైన తప్పులు దొర్లాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

భూమి హెచ్చుతగ్గులతో నమోదు కావడంతో తాము నష్టపోతున్నామని, ప్రస్తుత సర్వేను రద్దు చేసి పారదర్శకంగా తిరిగి రీ-సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బయ్యప్పగారిపల్లి గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags: Farmers’ Protest at Tahsildar Office Over Re-survey Errors