March 10, 2026
Explore
క్యూఆర్ కోడ్​తో కొత్త పాసు పుస్తకాలు – ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తోంది: సీఎం చంద్రబాబు

క్యూఆర్ కోడ్​తో కొత్త పాసు పుస్తకాలు – ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తోంది: సీఎం చంద్రబాబు

March 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామన్న సీఎం

ట్యాంపరింగ్ జరగకుండా కొత్త పాసుపుస్తకాలు

కూటమి ప్రభుత్వంలో కరెంట్‌ ఛార్జీలు పెంచబోమని స్పష్టం

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ట్యాంపరింగ్ జరగకుండా కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు. భవిష్యత్‌లోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామసభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్​తో ఇచ్చే పాసు పుస్తకాలతో ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తోందన్నారు.

Tags: New passbooks with QR code – anyone who makes a mistake will be immediately aware: CM Chandrababu