April 4, 2026
Explore
నగరంలో ట్రాఫిక్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు.

నగరంలో ట్రాఫిక్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు.

April 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణ.
  • హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నియమాలపై చైతన్యం.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పలు ప్రధాన కూడళ్లు, రహదారులు మరియు విద్యాసంస్థలలో ప్రజలకు, విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
  • ఈ సందర్భంగా 01-04-2026న తిరుపతి పిర్లా చవడి లోని ఎస్వీ హై స్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్య అంశాలైన ట్రాఫిక్ నిర్వహణ, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వినియోగం వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు.
  • అదేవిధంగా మహిళల భద్రత దృష్ట్యా సెల్ఫ్ డిఫెన్స్ పై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
  • ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ సంజీవ్‌కుమార్, సిబ్బంది నిర్వహించారు.

Tags:Extensive awareness programs by traffic police in the city.