ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. రేషన్ కార్డు అప్లికేషన్ సర్వీస్ ఛార్జ్‌లు పెరిగాయి. రేషన్ కార్డు సేవా రుసుం (సర్వీస్ ఛార్జ్)లను పెంచారు.
కొత్త రేషన్ కార్డు, డూప్లికేట్ రేషన్ కార్డు , రేషన్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రేషన్ కార్డు విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా రుసుము పెరిగాయి. గతంలో రూ. 24/- సేవా రుసుం కలిగిన సేవలు రూ.100/- లకు పెంచారు. గతంలో రూ.48/- సేవా రుసుముగా గల రేషన్ కార్డు విభజన సేవ రూ.200/- లకు పెంచారు. మీసేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్‌కార్డుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం సర్వీస్ ఛార్జీలు పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు, డూప్లికేట్ కార్డు తీసుకోవడానికి, రేషన్ కార్డులో తప్పులు సరి చేసుకోవడానికి, కొత్త సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించడం, అడ్రస్ మార్పు, రేషన్ కార్డును విభజించడం వంటి ఆయా సేవలకు సర్వీస్ ఛార్జీలకు అమలవుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం.. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రక్షాళన చేసింది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఉచితంగా పంపిణీ చేసింది. అలాగే గతంలో ఉన్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను రద్దు చేసి.. రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి ప్రజలు సరుకులు తీసుకునేలా పాత విధానాన్ని అమలు చేస్తోంది. అయితే వృద్ధులకు మాత్రం ఇంటి దగ్గరకు సరుకులు చేరవేస్తారు. ప్రతి నెలలో 15 రోజుల పాటూ రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉదయం, సాయంత్రం రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యంతో పాటుగా రాగులు, జొన్నలు గోధుమ పిండిని కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. గోధుమ పిండిని కిలో కేవలం రూ.20కే అందిస్తున్న సంగతి తెలిసిందే.
Tags: Alert for those with ration cards in AP.. The government has increased service charges, how much?