April 4, 2026
Explore
గాలివీడులో నేడు సంత వేలం

గాలివీడులో నేడు సంత వేలం

April 4, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

గాలివీడు స్థానిక మండల కేంద్రంలో శనివారం సంత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు నాయక్ తెలిపారు. ఈ వేలంలో ప్రధానంగా బుధవారం జరిగే కూరగాయల సంత, గురువారం నిర్వహించే మూగజీవాల సంతతో పాటు బస్టాండు రుసుముల వసూలు హక్కులను ఖరారు చేయనున్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయాలని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.

Tags: Market Auction in Galiveedu Today