April 4, 2026
Explore
గంగమ్మ దేవాలయ ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

గంగమ్మ దేవాలయ ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

April 4, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ దేవాలయ ధర్మకర్త మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఈఓ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన భక్తులు ఈఓ కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి, తగిన వివరాలతో 20 రోజుల్లోపు జిల్లా దేవాలయ శాఖ కమిషనర్‌కు సమర్పించాలని సూచించారు. నిబంధనల మేరకు అర్హులైన వారిని ధర్మకర్తలుగా ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు.

Tags: Applications Invited for the Appointment of the Gangamma Temple Board of Trustees