ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ లో యువతకు ఎస్‌బీఐ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.. రాష్ట్రంలో ఎస్‌బీఐ యూత్ ఫర్ ఇండియా పేరిట ఫెలోషిప్ అందిస్తోంది. పల్లెలు అభివృద్ధి చెందేలా యువత సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
రాష్ట్రంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎన్జీవోలతో కలిసి అధ్యయనం చేస్తారు. ఇలా పల్లెల్లో సేవలు అందించేందుకు ముందుకొచ్చే యువతను ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొస్తే.. వారికి వైద్య, బీమా భరోసా కూడా కల్పిస్తున్నారు. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల పల్లెల రూపురేఖలు మార్చాలనే ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు.
21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వారికి మాత్రమే ఎస్ఐబీ తీసుకొచ్చిన ఈ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాం ఉంటుంది. 2026 అక్టోబర్ 4నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ కార్యక్రమం 13 నెలల పాటూ ఉంటుంది.. దశాలవారీగా ఎంపిక చేస్తారు. ముందుగా దరఖాస్తును పూర్తి చేయాలి, వివరాలను పొంపదరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ అసైన్‌మెంట్ ఉంటుంది. ప్రధానంగా సామాజిక అంశాలపై వ్యాసాలు, సమస్యలకు పరిష్కారం వంటికి ఉంటాయి. అనంతరం అర్హులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.. అనంతరం ఈ కార్యక్రమానికి సంబందించి,న వివరాలతో పాటుగా ఫెలోషిప్ నిబంధనలు కూడా అక్కడే తెలుపుతారు.
ఆసక్తి ఉన్నవారు గూగుల్‌లోకి వెళ్లి www.sbi youth for india fellowship 2026 అని టైప్ చేయాలి. అనంతరం క్లిక్ చేస్తే పూర్తి వివరాలు ఉంటాయి. అనంతరం అక్కడ లాగిన్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆన్‌లైన్ ఫెలోషిప్ దరఖాస్తు కనిపిస్తుంది.. అందులో అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏం చదివారు.. విద్యార్హత ఏంటి తెలియేయాల్సి ఉ:టుంది.. అక్కడ మూడు ఆప్షన్స్ కూడా ఉంటాయి. డిగ్రీ పూర్తి, 2026 అక్టోబర్ 4లోగా పూర్తి చేస్తా, ఆయా తేదీ తర్వాత డిగ్రీ పూర్తవుతుందని అనే ఆప్షన్‌లు ఉంటాయి.. వీటిలో ఒకటి క్లిక్ చేస్తే సరిపోతుంది.. ఇదంతా మొదటి దశ కిందకు వస్తుంది.
మరోవైపు రెండో దశలో సిటిజన్‌షిప్‌లో ఐదు ఆప్షన్స్ ఉంటాయి.. వాటిలో ఒకటి క్లిక్ చేస్తే తర్వాత విండోకు వెళుతుంది. అనంతరం వయసుకు సంబంధించి మూడు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయాలి.. సరైన వివరాలు అయితే కంగ్రాట్స్, అర్హత సాధించారని విండో వస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.16వేల వరకు ఇస్తారు. అలాగే స్థానికంగా ప్రయాణ ఖర్చుల కోసం రూ.2వేలు, మరో రూ.వెయ్యి ప్రాజెక్టుకు సంబంధించి ఇస్తారు. అంతేకాదు ఈ ఫెలోషిప్ విజయవంతంగా పూర్తిచేసే వారికి మరో ఆఫర్ కూడా ఉంది.. వారికి రీ అడ్జస్ట్‌మెంట్ అలవెన్సుగా రూ.50 వేలు వస్తాయి. ఈ బెనిఫిట్స్‌తో పాటుగా హెల్త్, వ్యక్తిగత ప్రమాదాలకు బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఎన్జీవోలతో కలిసి పనిచేసే అవకాశం కూడా వస్తుంది.. యువతకు మంచి అవకాశం అంటున్నారు.
Tags: SBI Fellowship for youth in AP.. Up to Rs. 19 thousand per month will be given, apply now