సిద్దిపేట ముచ్చట్లు:
కులాలు వేరు కావడంతో అభ్యంతరం చెప్పిన పెద్దలు..!
తీవ్ర మనస్థాపంతో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు..!
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి తరిగొప్పుల హారిక ఒకరినొకరు ప్రేమించుకున్నారు..! హైదరాబాద్ లో పెద్దలకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు..!
పెళ్లైన మూడు నెలలకు హారికను స్వగ్రామానికి తీసుకువచ్చిన రాకేష్..! అయితే పెళ్లికి అంగీకరించే ప్రసక్తే లేదని.. అమ్మాయిని వదిలేస్తేనే ఇంటికి రావాలని తేల్చిచెప్పిన రాకేష్ తల్లిదండ్రులు..!
దీంతో ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హారిక..! రాకేష్ రెడ్డి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు..!
కౌన్సిలింగ్ తర్వాత కూడా పెళ్లికి సుముఖంగా కనిపించని తల్లిదండ్రుల వ్యవహారం..! దీంతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాకేష్ రెడ్డి
ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హారిక..!
Tags; A Tragic End for a Loving Couple..!