April 3, 2026
Explore
నేర చరిత్ర స్వభావము గల వ్యక్తుల పై పోలీసుల కఠిన వైఖరి

నేర చరిత్ర స్వభావము గల వ్యక్తుల పై పోలీసుల కఠిన వైఖరి

April 3, 2026 | Andhra Pradesh

శ్రీ సత్య సాయి ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు…

గత నెలలో నేర చరిత్ర స్వభావము గల 55 మంది పై బైండ్ ఓవర్ కేసులు నమోదు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బాండ్ స్వాధీనము…

గత రాత్రి తేరు వద్ద అల్లరి చిల్లరిగా తిరుగుతూ అమ్మాయిల ప్రేమ విషయములో గుంపులుగా కలబడి కొట్టుకున్న విషయములో

1) షేక్ నవాజ్, వయస్సు 21 సంవత్సరాలు, తండ్రి పేరు: వాజీద్ అలీ, వాలిసాబ్ రోడ్, కదిరి టౌన్,

2) షేక్ గౌస్ బాషా, వయస్సు 21, తండ్రి పేరు: షేక్ మౌలాలి, నల్లగుట్ట వీధి, కదిరి టౌన్,

3) మహమ్మద్ మాజ్, వయస్సు 20, తండ్రి పేరు: షేక్ మహమ్మద్ బాబు, వలిసాబ్ రోడ్, కదిరి టౌన్,

4) షేక్ ఫైదాన్, వయస్సు 19, తండ్రి పేరు : షేక్ అబ్దుల్లా, నల్లగుట్ట స్ట్రీట్, కదిరి టౌన్
అను నలుగురిని ఈ రోజు తగిన పోలీసు కౌన్సెల్లింగ్ ఇవ్వడము జరిగింది. వారు భవిష్యత్తులో ఒక సంవత్సరాల కాలము నందు ఎటువంటి నేరాలు చేయకుండా ఉండేందుకు కదిరి తహశీల్దార్ వారి వద్ద ఒక్కొక్కరి వద్ద నుండి 5 లక్షల రూపాయల బాండ్ స్వాధీనము చేసుకోవడం జరిగింది.పోలీసు స్టేషన్ కు ఎవరైనా గొడవపడి వచ్చినట్లు అయితే వారందరినీ కూడా కదిరి తహశీల్దార్ వారి వద్ద వారి సత్ప్రవర్త కొరకు బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది. ఆ క్రమములో ఇప్పటి వరకు గత నెలలో నేర స్వభావము గల 55 మందిని, మరియు గత సంవత్సరము కాలములో సుమారు 325 మందిని బైండ్ ఓవర్ చేయించడం జరిగింది.ఎవరైనా బైండ్ ఓవర్ కేసులో నమోదు అయిన పక్షములో వారు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందుటలో, పాస్పోర్ట్ లు తీసుకోవడములో పోలీసులు NOC, నందు వాటిని నమోదు చేయడం వలన వాటిని వారు పొందలేరు. అలాగే బైండ్ ఓవర్ చేసిన వారిలో ఎవరైనా తిరిగి నేరములో పాల్గొంటే వారి నుండి వారి ద్వారా తీసుకున్న 5 లక్షల బాండ్ ను వసూలు చేయడమే కాకుండా, వారినకి ఒక నెల వరకు జైలు శిక్ష తహశీల్దార్ గారు విదించడం జరుగుతుంది అనే విషయము గమనించగలరు.ఇప్పటి నుండి ఏ రోజుకు ఆరోజు బైండ్ ఓవర్ చైనా వారి వివరాలు పత్రికా ముఖంగా వారి పేర్లు ప్రకటించడం జరుగుతుంది.

Tags:Police adopt a tough stance towards individuals with a criminal background.