అనంతపురం ముచ్చట్లు:
అన్నమయ్య: APSPDCL పరిధిలో నకిలీ ఐటీఐ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో నియమితులైనట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగిస్తూ సంస్థ సీఎండీ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కడపలో 38 మంది, చిత్తూరులో 4 మంది, అన్నమయ్య జిల్లాలో ఒకరిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Tags: Jobs Secured with Fake Certificates – Action Taken Against 69 Shift Operators