April 2, 2026
Explore
మణప్పురం రితి జూవెలరీస్ మేనేజర్ సూరజ్ పై కేసు నమోదు

మణప్పురం రితి జూవెలరీస్ మేనేజర్ సూరజ్ పై కేసు నమోదు

April 2, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో సంచలనం రేకెత్తించిన మణప్పురం రితి జువెలరీస్ మోసాలపై మదనపల్లె వన్ టౌన్ పోలీసులు ఎట్టికేలకు స్పందించారు. మణప్పురం యాజమాన్యం విష్ణు సోమ సుందర్ ఇచ్చిన ఫిర్యాదు పై ఆ సమస్త గత మేనేజర్, కేరళకు చెందిన సూరజ్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు గురువారం వన్ టౌన్ సీఐ రాజారెడ్డి మీడియాకు తెలిపారు. పట్టణంలోని ప్రజలను వివిధ పథకాల పేరుతో ఆకర్షించి వారి డబ్బు కాజేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags: Case Registered Against Manappuram Rithi Jewellers Manager, Suraj