April 2, 2026
Explore
తిరువూరులో సేవా భావానికి నిదర్శనం ఎస్ ఐ గౌరీశ్వరి

తిరువూరులో సేవా భావానికి నిదర్శనం ఎస్ ఐ గౌరీశ్వరి

April 2, 2026 | Andhra Pradesh

ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:

పరిపూర్ణ బాలల ఆశ్రమానికి కూలర్ వితరణ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్‌పై సూర్యా రెస్టారెంట్ సమీపంలో ఉన్న పరిపూర్ణ బాలల ఆశ్రమంలో సేవా కార్యక్రమం హృదయాలను హత్తుకుంది.

తిరువూరు మహిళా సబ్ ఇన్స్పెక్టర్ గౌరిశ్వరి ఆశ్రమంలోని చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్‌ను వితరణగా అందించారు.

ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆశ్రమంలో నివసిస్తున్న చిన్నారులు వేడిమిని తట్టుకోవడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన ఎస్‌ఐ గౌరిశ్వరి , వారికి చల్లని వాతావరణం కల్పించాలనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి కూలర్‌ను అందించడం విశేషం.

ఈ సహాయం వల్ల చిన్నారులు ఎంతో ఆనందంగా, సౌకర్యంగా ఉండగలుగుతున్నారని ఆశ్రమ సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు (అభి) మరియు వరలక్ష్మి గారు మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం ఎంతో అభినందనీయం అన్నారు.చిన్నారుల ఆరోగ్యం, సౌకర్యం పట్ల చూపిన శ్రద్ధకు ఎస్‌ఐ గౌరిశ్వరి కి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, మరింత మంది సేవా భావంతో ముందుకు రావాలని ఆశిస్తూ కార్యక్రమం ముగిసింది.

Tags: SI Gourishwari is a testament to the spirit of service in Tiruvuru.