తిరుపతి ముచ్చట్లు:
- మూలవర్లకు స్వర్ణ ముఖ పట్టి బహూకరణ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు బుధవారం కానుకలు పంపారు .
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ శుభ సందర్బంగా మూలవర్లకు అలంకరించేందుకు ఒక కేజి బరువు గల స్వర్ణ ముఖ పట్టి, 2కేజిల బరువు గల వెండి బింది కానుకగా అందించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు.
ఆలయం ముందు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, జేఈవో శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Divine Offerings from Lord Srivaru of Tirumala to Sri Sita and Rama