తెలంగాణ ముచ్చట్లు:
నల్లగొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం గ్రామం వైపు వెళ్తుండగా టిప్పర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు అధికారులు తెలిపారు. చూస్తుండగానే టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Fire in a tipper lorry.. Burned while watching