పుంగనూరుముచ్చట్లు:
డెబైఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మండలంలోని బోడినాయునిపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇంటిలో ఉండగా మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో వారి ఇంటి ప్రక్కనే నివాసం ఉన్న హేమంత్(39) అనే వ్యక్తి ఆమె ఇంటిలో దూరి వృద్ధురాలి నోటిలో గుడ్డలు పెట్టి మానభంగప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడంతో నిందితుడు పరారైయ్యాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేపట్టారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Tags: Attempted Rape of 70-Year-Old Woman