April 1, 2026
Explore
ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు..

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు..

April 1, 2026 | Andhra Pradesh

ఇరాన్ ముచ్చట్లు:

ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో విరుచుకుపడింది.

రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.

ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పంచుకున్నారు.

అయితే దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ఇస్ఫహాన్‌లో ఇరాన్ ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది.ఇస్ఫహాన్‌పై వరుస దాడులు జరగడంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగుతున్నట్టు పేర్కొంది.అయితే ఈ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ఇస్ఫహాన్‌లోని ఓ భూగర్భ కేంద్రంలో సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇరాన్ దాచినట్టు వార్తలు వస్తున్నాయి.ఆ యురేనియం నిల్వల లక్ష్యంగానే తాజా దాడులు జరిగినట్టు సమాచారం. కాగా, తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై భారీగా దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.మరోవైపు అమెరికాతో ఒప్పందానికి అంగీకరించేది లేదని ఇరాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అమెరికా దాడులకు దిగినట్టు తెలుస్తోంది..

Tags: US Attacks on Iran’s Nuclear City