April 1, 2026
Explore
మళ్లీ పెరిగాయ్.. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

మళ్లీ పెరిగాయ్.. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

April 1, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వినియోగదారులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 195.50 మేర పెరిగింది. అయితే, గృహ వినియోగదారులకు.. ఆ వివరాలు ఇలా..

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. 2026, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్‌పిజి సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చేలా 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 195.50(ఢిల్లీలో) మేరకు పెంచాయి. అటు కోల్‌కతాలో రూ.218 వరకు ధర పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. గత మార్చి 1న కూడా వాణిజ్య సిలిండర్ ధర రూ. 114.5 పెరిగిన విషయం గమనార్హం. వాణిజ్య గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ అవసరాల సిలిండర్ ధర రూ. 913 వద్దే కొనసాగుతోంది. చివరిసారిగా మార్చి 7న దీని ధర రూ. 60 పెరిగింది. కాగా, హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 214.50 పెరిగింది. పెరిగిన ధరతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2321కి చేరుకుంది.

👉పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం..

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు 50 శాతం వరకు పెరిగాయి. దీని ప్రభావం వల్లే ఎల్‌పిజి ధరలను పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఎల్‌పిజి ధరలు పెరుగుతున్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం గత ఏడాది మార్చి నుంచి స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 94.72, డీజిల్ రూ. 87.62గా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC), భారత్ పెట్రోలియం(BPCL), హిందుస్థాన్ పెట్రోలియం(HPCL) ప్రతి నెలా ఒకటో తేదీన అంతర్జాతీయ ధరలు, రూపాయి విలువ ఆధారంగా ఎల్‌పిజి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను సమీక్షిస్తాయి.

Tags: They’ve gone up again… Here are the gas cylinder prices in the Telugu states.