March 31, 2026
Explore
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండ చూడాలి

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండ చూడాలి

March 31, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య లేకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల సమావేశాన్ని ఎంపిడివో అప్పాజి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల సమస్యలపై సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో నీటి సమస్య లేకుండ చూడాలన్నారు. సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నివేదికలు అందజేయాలని , వాటిని ఎమ్మెల్యేకు పంపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్‌డబ్యూజ్లిఎస్‌ జెఈ చందన మాట్లాడుతూ సమస్య ఉన్న ప్రాంతాలను తెలిపితే తక్షణమే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఎంఈవో నటరాజారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నాడు-నేడు పనులు విద్యార్థుల సంఖ్యను బట్టి మంజూరు జరుగుతుందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎంపిడివో అప్పాజి, తహశీల్ధార్‌ రాము, ఈవోపీఆర్‌డి నారాయణ, మండల ఉపాధ్యక్షులు సరోజమ్మ, ఈశ్వరమ్మ, కో ఆఫ్షన్‌ మెంబరు బాబ్‌జాన్‌తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

సర్పంచ్‌లకు ఘనంగా వీడ్కోలు ….

ఐదేళ్ల సర్పంచ్‌ పదవికాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఎంతో కృషి చేశారని ఎంపీపీ భాస్కర్‌రెడ్డి వారి సేవలను కొనియాడారు. వైఎస్సార్‌సిపి అధికారంలోకి రాగానే మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల ఆధ్వర్యంలో మండలంలో 23 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారని కొనియాడారు. ఐదేళ్ల కాలంలో కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండ చేశారని, ప్రతి గ్రామంలోను సిమెంటు కాలువలు, రోడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు , లీంక్‌రోడ్డులు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్‌సిపి సర్పంచ్‌లకే దక్కిందని కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను సన్మానించి, ఘనంగా వీడ్కోలు పలికారు.

Tags; Steps must be taken to ensure there are no water problems in rural areas.