March 9, 2026
Explore
బసవరాజ హైస్కూల్‌కు 145 సంవత్సరాల చరిత్ర

బసవరాజ హైస్కూల్‌కు 145 సంవత్సరాల చరిత్ర

March 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఘన చరిత్ర ఆ పాఠశాల సొంతం . ఎందరో ప్రముఖులు , ఉన్నతాధికారులకు అక్షరాలు నేర్పించి, దేశ, విదేశాలలో స్థిరపడేందుకు వార్యధిగా నిలిచిన బసవరాజ హైస్కూల్‌, కళాశాలలో వేలాది మందిని విద్యావంతులను చేసింది. అటువంటి పాఠశాల నేడు దుస్థితిలో ఉంది. తనను ఆదుకునే వారి కోసం ఎందురు చూస్తోంది.

                     పుంగనూరులోని బసవరాజ హైస్కూల్‌కు సుధీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 145 ఏళ్ల క్రితం పుంగనూరు జమీందారులు ఏడేకరాల స్థలంలో ఈ హైస్కూల్‌ను నిర్మించారు. జమీందార్‌ రాజవీరబసవ చిక్కరాయల్‌ వైబి తన కుమారుని పేరున బసవరాజ హైస్కూల్‌ను 1881లో ప్రారంభించారు.  జిల్లాలోనే ఇంత పెద్ద హైస్కూల్‌ ఎక్కడా లేదు. ప్రస్తుతం 924 మంది విద్యార్థులు చదువుతున్నారు. వెహోత్తం 30 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 17 గదుల్లో తరగతులు జరుగుతున్నాయి. ఈ పాఠశాలలో విద్యనభ్యసించి వారు  ఐఏఎస్‌, ఐపిఎస్‌లుగా, జర్నలిస్టులుగా, డాక్టర్లు, ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. కొంత మంది ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. అటువంటి పాఠశాలకు నేడు ఆదరణ కరువైంది. భవనాలు శ్యి•లావస్థకు చేరుకున్నాయి. మౌలిక వసతులు కొరవడ్డాయి. పాఠశాల అభివ-ద్ధి గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

పాఠశాలలో చదివిన ప్రముఖులు….

ఈ పాఠశాలలో చదువుకున్న శేషగిరిశా సీనియర్‌ జర్నలిస్టుగా ఉండి, జవహర్‌లాల్‌ నెహ్రూకు సన్నిహితుడుగా మెలిగారు. ఆ సమయంలో రౌండు టేబుల్‌ సమావేశం తర్వాత మౌంట్‌బాటన్‌ అమెరికా నుంచి ఇండియా ఆగమనం అన్న తొలి సంచలన వార్తను రాశారు. దీంతో దేశంలోనే విశేషమైన గౌరవాన్ని ఆనాడు పొందారు. అలాగే చారాల చెన్నారెడ్డి అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రి భావానగర్‌ మహారాజ్‌ సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆనారోగ్యం కారణంగా చెన్నారెడ్డి పుంగనూరు సమీపంలోని చారాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి భావానగర్‌ మహారాజ్‌ చారాల వచ్చి చెన్నారెడ్డిని పరామర్శించారు. వీరి అనుబంధం ఎలాంటిదో దీనిని బట్టి తెలుస్తోంది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన ఆర్‌. వెంకటరెడ్డినెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ప్లామెంటు సెక్రటరీగా పని చేశారు. ఎన్‌. జయరామిరెడ్డి కాఫీబోర్డు చీఫ్‌ మార్కెంటింగ్‌ అధికారిగా పని చేశారు. డాక్టర్‌ సేతు మాధవరావు మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో గోల్డ్మెడల్‌ సాధించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రామ్మూర్తిశెట్టి ఈపాఠశాలకు చెందిన వారే. ఐఏఎస్‌ అధికారులుగా పని చేసిన వారిలో ఆవుల చెంగప్ప, మునివెంకటప్ప, కుర్రా రామిరెడ్డి ఉన్నారు. ఐపీఎస్‌ అధికారి గురునాథరావు, మాజీ అడ్వకేట్‌ జనరల్‌గా ఆర్‌. వేణుగోపాలరెడ్డి, వెల్లాల శ్రీకంటయ్య, పుంగనూరు తొలి ఎమ్మెల్యే బాడాల క-ష్ణమూర్తి ఈ పాఠశాలలో చదివినవారే. అలాగే రామక-ష్ణయ్యశెట్టి ఐపిఎస్‌, ఆర్‌. రఘోత్తమరావు ఐఏఎస్‌ ఈ పాఠశాలలో చదివారు. ఇలాంటి వారెందరికో చదువు చెప్పిన పాఠశాల నేడు సాయం కోసం ఎదురుచూస్తోంది.

రచయితలు ….

బసవరాజ కళాశాలలో విద్యాభ్యాసం అభ్యసించిన పుంగనూరు నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే, తామ్రపత్ర గ్రహిత బడాల క్రిష్ణమూర్తి కౌటిల్యున్ని అర్థశాన్ని తెలుగులోనికి అనువధించారు. ఈ పుస్తకాని మాజీ ప్రధాని పివి. నరసింహారావుకు అంకితం ఇచ్చారు. అలాగే కవి పండితులు కెఎన్‌. మురళిధర్‌ ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతి అవార్డును మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలామ్‌ చేతులు మీదుగా స్వీకరించారు. వక్కంతం సూర్యనారాయణరావు సీనికవి రచయితగా నంది అవార్డు పొందారు. ఆయన కుమారుడు వక్కంతం వంశీ సిని రచయిత, దర్శకుడుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇలాంటి ప్రముఖులెందరికో బసవరాజ కళాశాల మార్గదర్శకంగా నిలిచింది.

Tags: Basavaraja High School has a history of 145 years.