March 30, 2026
Explore
తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు, జరిమాన

తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు, జరిమాన

March 30, 2026 | Andhra Pradesh

విజయనగరం ముచ్చట్లు:


విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

విజయనగరం జిల్లా, 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2025 సం.లో నమోదైన హత్య కేసులో నిందితుడు విజయనగరం పట్టణం, గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20 సం.లు)కు జీవిత ఖైదు, రూ.2,000/-లు జరిమాన విధిస్తూ విజయనగరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఎం. బబిత తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మార్చి 30న తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణం, గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20 సం.లు) తన తండ్రితో కలిసి నివాసం ఉంటున్నాడన్నారు. తన తండ్రి పేరు మీద ఉన్న ఇల్లును తనకు ఇచ్చేయమని, కొడుకు కొంతకాలంగా తండ్రిని అడగగా, తండ్రి అందుకు నిరాకరించగా తేది 13.02.2025న రాత్రి ఇంటికి తాగి వచ్చి తండ్రిని చేతులతో గుండె మీద బలంగా గుద్ది, కాళ్ళతో తన్ని చంపేసాడన్నారు. మృతుడి భార్య తన కూతురుతో వేరేగా నివాసం ఉంటున్నారన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బి.మురళి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేయగా, విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి, హత్య కేసుగా ఆల్టర్ చేసి, నిందితుడును అరెస్టు చేసి, రిమాండుకి తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను త్వరితగతిన పూర్తి చేసేటట్లు పోలీసు మరియు జ్యుడిషియల్ అధికారులు చర్యలు చేపట్టారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.

ఈ కేసు విచారణలో నిందితుడు కర్నపు సాయి (20 సం.లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ ఎం. బబిత నిందితుడికి జీవిత ఖైదు మరియు రూ.2,000/ – జరిమాన విధిస్తూ తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ మార్చి 30న తెలిపారు. ఈ కేసులో నిందితుడు శిక్షింపబడే విధంగా సాక్షులకు బ్రీఫ్ చేసి, సాక్ష్యం చెప్పే విధంగా 2వ పట్టణ పోలీసు స్టేషన్ కోర్టు ఉమెన్ కానిస్టేబుల్ టి.లక్ష్మి, సి.ఎం.ఎస్. ఎస్ఐ పి.ఈశ్వరరావు సమర్ధవంతంగా పని చేసారన్నారు. పోలీసు వారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించగా, విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ టి.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి, ప్రాసిక్యూషను జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. నిందితుడికి 13 నెలల కాలంలోనే శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టిన పిపి, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ అభినందించారు.

Tags:Son who killed his father sentenced to life imprisonment and fine.