బంజారాహిల్స్ ముచ్చట్లు:
బంజారాహిల్స్‌లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మంది వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జరిపిన సంయుక్త దాడిలో భారీగా గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్య వివరాలు:
అరెస్ట్ అయిన వారు: 10 మంది.
స్వాధీనం చేసుకున్న సిలిండర్లు: మొత్తం 414 (వివిధ పరిమాణాలు).
సీజ్ చేసిన వాహనాలు: 10 (డీసీఎంలు, బొలెరో, టాటా ఏస్ మరియు ఆటోలు).
మొత్తం విలువు: సుమారు ₹ 21,88,000/-.
నిందితుల వివరాలు:
మొహమ్మద్ అమీర్ (42): గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు (ప్రధాన నిందితుడు).
మొహమ్మద్ యూసుఫ్ (32): గ్యాస్ డెలివరీ బాయ్.
మొహమ్మద్ ఇస్మాయిల్ (27): గ్యాస్ డెలివరీ బాయ్.
ఎ. రామారావు (42): గ్యాస్ డెలివరీ బాయ్.
లోక్ కుమార్ (24): బంజారాహిల్స్ నివాసి.
మొహమ్మద్ సక్రుద్దీన్ (42): కూలీ.
మొహమ్మద్ ముంతాజ్ అన్సారీ (35): డ్రైవర్.
మొహమ్మద్ మినాజ్ అన్సారీ (42): కూలీ.
రాజేష్ పాల్ (36): డ్రైవర్.
రామ్ రాజ్ సింగ్ (54): నల్ల పోచమ్మ దేవాలయ అధ్యక్షుడు (స్థల యజమాని/అద్దెకు ఇచ్చిన వ్యక్తి).
నేర విధానం (Modus Operandi):
ప్రధాన నిందితుడు మొహమ్మద్ అమీర్, శంషాబాద్ కేంద్రంగా “మెట్రో గ్యాస్ ఏజెన్సీ” నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా, ఇతడు బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఒక స్మశాన వాటికలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ (Dumping) చేస్తున్నాడు. అక్కడి నుండి తన సిబ్బంది సహాయంతో అవసరమున్న ఖాతాదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు గడిస్తున్నట్లు విచారణలో తేలింది.
పోలీసుల చర్య:
విశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ చ. యదేందర్, ఎస్.ఐ డి. రవిరాజ్ మరియు వారి బృందం, బంజారాహిల్స్ పోలీసులతో కలిసి ఈ దాడి నిర్వహించారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Tags:Gang Selling Illegal Gas Cylinders Arrested