మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌంటింగ్ వేగంగా సాగుతోంది. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో 1, 11, 15 వార్డుల ఓట్ల లెక్కింపు మొదలైంది. మూడు కౌంటింగ్ హాళ్లలో 72 టేబుళ్లపై సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. పింక్, వైట్ బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టలు కట్టిన అనంతరం అభ్యర్థుల వారీగా లెక్కింపు చేపట్టారు. అబ్జర్వర్ జి.బాలకృష్ణ, ఎస్పీ ధీరజ్ పర్యవేక్షణలో ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. తొలి రౌండ్ ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Tags: Counting begins in wards 1, 11, and 15