తిరుపతి ముచ్చట్లు:
రాత్రిపూట ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
దొంగతనాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించండి.
ఆరు బయట నిద్రిస్తే చోరీలు జరిగే అవకాశం ఎక్కువ….
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
ఊర్లకు వెళ్లే కుటుంబాలు పోలీసులకు సమాచారం ఇచ్చి ఎల్ హెచ్ ఎం ఎస్ ను వినియోగించుకోండి.
డిజిటల్ అరెస్ట్ పేరుతో కాల్స్ వస్తే భయపడకండి.
ఆన్లైన్లో ఉచిత డబ్బుల పేరిట ఆశలకు పోతే మోసపోయే అవకాశం.
లోన్లు ఇస్తామంటూ ఫోన్లుకు వచ్చే కాల్స్ కు సమాధానాలు చెప్పి మోసపోకండి.
సెలవులపై వచ్చిన పిల్లలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచండి.
తల్లిదండ్రుల సంరక్షణలోనే ఈతలు నేర్పించండి….
ద్విచక్ర వాహనాలను పిల్లలకు ఇచ్చి ప్రమాదాలకు గురైతే తల్లిదండ్రులకు బాధ వర్ణనాతీతం.
వేసవి సెలవులపై వచ్చిన పిల్లలకు క్రీడలు, చదువు వంటి సృజనాత్మకత పై మెలిగేలా చూడండి.
వ్యవసాయ పంపుసెట్ల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ కాకుండా జాగ్రత్తలు పాటించండి..
ప్రజల సహకారం ఉంటేనే ఆస్తి ప్రాణ నష్టాలను సంవర్ధనంగా నివారించాగలుగుతాం.
రాత్రిపూట గస్తీ పెంచుతాం ప్రజల రక్షణే మా బాధ్యత అంటూ చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడి.
Tags: Chandragiri Police Take Precautionary Measures in View of Summer.