October 25, 2026
Explore
ములకలచెరువులో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు

ములకలచెరువులో ఇద్దరు పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు

October 25, 2026 | Andhra Pradesh

ములకలచెరువుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పోలీసు అధికారులపై ఎస్ఈసీ చర్యలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నిర్లక్ష్యం, పక్షపాతంపై ఆరోపణలు

ములకలచెరువు సీఐ కె. దస్తగిరి, ఎస్ఐ పి. రామకృష్ణలపై చర్యలకు ఆదేశం

నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కలిగించారన్న ఆరోపణలపై విచారణ

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఎన్నికల విధుల్లో ఇద్దరు అధికారులు పక్షపాతంగా వ్యవహరించినట్లు నివేదికలో ప్రస్తావన

1964 ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం

కర్నూలు రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీకి బాధ్యతలు అప్పగింత

ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి కూడా తక్షణమే తప్పించాలని ఆదేశాలు

అధికారులను విధుల నుంచి తప్పించినట్లు అక్టోబర్ 24 రాత్రి 7 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

క్రమశిక్షణ చర్యలపై నవంబర్ 5లోగా నివేదిక సమర్పించాలని ఎస్ఈసీ ఆదేశం

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగేందుకు అధికారుల బాధ్యతాయుత వైఖరి కీలకం

Tags: SEC orders disciplinary action against two police officers in Mulakalacheruvu