October 25, 2026
Explore
మదనపల్లె డివిజన్‌లో భారీ వర్షం: 324.6 మి.మీ నమోదు

మదనపల్లె డివిజన్‌లో భారీ వర్షం: 324.6 మి.మీ నమోదు

October 25, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె డివిజన్‌లో శనివారం భారీ వర్షం కురిసిందని డివైఎస్ఓ సురేష్ బాబు ఆదివారం ఉదయం తెలిపారు. అత్యధికంగా నిమ్మనపల్లెలో 76.6 మి.మీ, పెద్దమండెంలో 50.4 మి.మీ, మదనపల్లెలో 48.2 మి.మీ వర్షపాతం నమోదైంది. బి.కొత్తకోట 37, తంబళ్లపల్లె 30.6, మొలకలచెరువు 25.4, పీటీఎం 16.8, కురబలకోట 14.4, పుంగనూరు 10, చౌడేపల్లె, రామసముద్రంలో 7.6 మి.మీ చొప్పున నమోదైంది. డివిజన్ మొత్తం 324.6 మి.మీ. నమోదైనట్లు తెలిపారు.

Tags:Heavy rainfall in Madanapalle division: 324.6 mm recorded