October 24, 2026
Explore
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.

October 24, 2026 | Andhra Pradesh

. వ్యవసాయ బావిలో యువతి మృతదేహం

మహబూబాబాద్ ముచ్చట్లు:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్వరి (21) వ్యవసాయ బావిలో మృతదేహమై కనిపించింది.

నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మహేశ్వరికి తొమ్మిది నెలల పాప శరణ్య, రెండేళ్ల కుమారుడు దేవాన్స్ ఉన్నారు.

శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేశ్వరి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు. ఈ క్రమంలో వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

మహేశ్వరి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:Tragedy in Mahabubabad district.