October 24, 2026
Explore
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

October 24, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లాముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేంద్రాల వద్ద అధికారులు, అభ్యర్థులు నిర్భయంగా వారి విధులు నిర్వర్తించేలా భద్రత కల్పిస్తూ అనధికార వ్యక్తులు గుమిగూడకుండా కఠిన ఆంక్షలు విధించారు.

ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Tags;Scrutiny of ZPTC and MPTC nominations