చిన్నమండెంముచ్చట్లు:
ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో చిన్నమండెం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం పరిశీలించారు. కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తును తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Tags:DIG Koya Praveen inspected the nomination center