October 23, 2026
Explore
నామినేషన్ల కేంద్రాల్లో పోలీసు ఉన్నతాధికారుల తనిఖీలు

నామినేషన్ల కేంద్రాల్లో పోలీసు ఉన్నతాధికారుల తనిఖీలు

October 23, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని పలు నామినేషన్ల కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు తనిఖీ చేశారు. చిన్నమండెం, మదనపల్లె జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, బి.కొత్తకోట కేంద్రాలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తనిఖీ చేశారు. బందోబస్తును పటిష్టం చేయాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనుమతి ఉన్నవారినే కేంద్రాల్లోకి అనుమతించాలని, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags;Inspections by senior police officials at nomination centers