March 29, 2026
Explore
జీజీహెచ్ లో ఖైదీ పరారీ..పోలీసుల కళ్ల ముందే షాక్…

జీజీహెచ్ లో ఖైదీ పరారీ..పోలీసుల కళ్ల ముందే షాక్…

March 29, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

జీజీహెచ్ (GGH)లో రిమాండ్ ఖైదీ పరారీ అయిన ఘటన కలకలం రేపింది..

చేబ్రోలు ప్రాంతంలో నమోదైన హత్య కేసులో నిందితుడు నాగుల్ మీరా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

అతడిని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (GGH) కు జైలు పోలీసులు తీసుకువచ్చారు..

ఈ సమయంలో పోలీసుల కళ్లుచెదరగొట్టి ఖైదీ అక్కడి నుంచి పారిపోయాడు..

ఆసుపత్రి పరిసరాల్లో వెతికినా అతను కనిపించలేదు..

దీంతో గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు..

Tags:Prisoner Escapes from GGH… A Shocking Flee Right Under the Noses of Police.