March 29, 2026
Explore
నకిలీ బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్ట బోయిన వ్యాపారి.

నకిలీ బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్ట బోయిన వ్యాపారి.

March 29, 2026 | Andhra Pradesh

గోల్డ్ అప్రైజర్ వస్తువు ను పరిశీలించి నకిలీ ది గా గుర్తింపు,

బిల్లులు తీసుకువస్తానని బ్యాంక్ నుంచి నెమ్మదిగా జారుకున్న వ్యాపారి.

వినుకొండ ముచ్చట్లు:

పట్టణంలోని ఒక బ్యాంక్ కు నకలీ వస్తువు తీసుకువెళ్లి బంగారుపు వస్తువుగా తాకట్టు పెట్ట బోయిన వ్యాపారి.

తాకట్టు పెట్టుకోబోయిన బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ఆ వస్తువు ను పరీశిలించి, అది నకలీదిగా గుర్తించి, అది నకలిదని ఏలా తాకట్టు పెట్టుకుంటామని వ్యాపారిని ప్రశ్నించగా, ఆ వస్తువు తాలుకా బిల్లులు తీసుకువస్తానని బ్యాంక్ నుంచి ఆ వ్యక్తి మెల్లగా జారుకున్నట్లు సమాచారం.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన…. దీనిపై బ్యాంక్ మేనేజర్ ను వివరణ కోరగా జరిగిన సంఘటన యాదార్దమేనని తెలిపాడు.

Tags;Businessman attempts to pledge fake gold at a bank.