October 22, 2026
Explore
మదనపల్లె ఎంపీటీసీ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

మదనపల్లె ఎంపీటీసీ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

October 22, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, 2వ రోజు గురువారం ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ఎన్నికల కేంద్రానికి 100మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరూ గుంపులుగా ఉండరాదని సూచించారు.144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

Tags: Heavy security arrangements at the MPTC center in Madanapalle