అమరావతి ముచ్చట్లు:
ఏపీలో పరిషత్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో మొత్తం 659 జెడ్పీటీసీ (ZPTC), 9829 ఎంపీటీసీ (MPTC) స్థానాలకు ఈ నెల 23 తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్లో 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాఅధికారులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
Tags:Nominations for MPTC and ZPTC elections begin today