తిరుమల ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిఫారసు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకు ఇది వర్తిస్తుందని, భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Tags;Temporary break for recommendation letters in Tirumala