ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ.. 19 పట్టణ స్థానిక సంస్థలపై ప్రభావం!
అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్ల దాఖలు సమయంలో తమ పార్టీ అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారనే ఫిర్యాదులను పరిశీలించి, గడువు పొడిగించాల్సిన అవసరంపై గురువారం లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
అలాగే, తుది అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 26 వరకు ప్రచురించవద్దని సూచించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గూటి, కడప, రాజంపేట, పులివెందుల, బద్వేలు, తిరుపతి, ప్రొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
అయితే, ఈ 19 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను సుప్రీంకోర్టు నిలిపివేయలేదు. నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Tags: Crucial orders from the Supreme Court..!