ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సిఫారసు దర్శనాలు అనుమతించబడవు
స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ పరధిలోని వ్యక్తులకు మాత్రమే దర్శనం.
సామాన్య భక్తులకు ఏ ఇబ్బంది లేని దర్శనం అందుబాటులో ఉంటుంది.
ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చిన నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఎటువంటి సిఫారసు లేఖలను అనుమతించబోమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆలయ ఈవో శీనా నాయక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసారు.
ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నంత వరకు సిఫారసు ఆధారంగా కల్పించే దర్శనాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు చేసిన సిఫార్సుల ద్వారా దర్శనంకు అనుమతి లేదని,
అయితే, స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ పరధిలోని వారికి మాత్రమే నిబంధనల ప్రకారం దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మరియు వారి ద్వారా వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయయంత్రాంగంతో పూర్తిస్థాయిలో సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేసారు.
సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని, సత్వర దర్శనం అందుబాటులో ఉంటుందని ఈవో పేర్కొన్నారు.
Tags;Break for ‘recommendation-based’ (VIP/referral) darshans – Temple administration takes a key decision in light of the election code