లక్కీరెడ్డి పల్లి ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ పర్యవేక్షణలో, లక్కిరెడ్డిపల్లె సీఐ హెచ్. కృష్ణంరాజు నాయక్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిన్నెపాడు, వడ్డేపల్లి, బెస్తపల్లి హరిజనవాడల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, వాహనాల పత్రాలను తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్‌ఐలు జి. శోభ, జె. నరసింహారెడ్డి, కె.బి. శివకుమార్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Tags: Intensive police checks in the wake of local body elections