October 19, 2026
Explore
కంటిలో పన్ను.. వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. విస్తుపోయిన డాక్టర్లు!

కంటిలో పన్ను.. వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. విస్తుపోయిన డాక్టర్లు!

October 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

భారత్‌లో 16 ఏళ్ల బాలుడి కంటి గుంతలో పన్ను గుర్తింపు

కంటిపైన వాపు రావడంతో పరీక్షించగా అసలు విషయం వెల్లడి

ఇలాంటి కేసు ప్రపంచంలోనే ఇదే మొదటిసారన్న‌ వైద్య నిపుణులు

ఈ సమస్యను ‘ఎక్టోపిక్ టూత్’ అంటార‌ని వెల్ల‌డి

శస్త్రచికిత్స ద్వారా పన్నును విజయవంతంగా తొలగించిన వైద్యులు

ఎక్టోపిక్ టూత్’ అంటే ఏమిటి?

నోటిలో కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో పన్ను పెరగడాన్ని వైద్య పరిభాషలో ‘ఎక్టోపిక్ టూత్’ అని పిలుస్తారు. కొన్నిసార్లు అంగిలిలో, ముక్కు లోపలి భాగంలో ఇలాంటి పళ్లు పెరగడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ, కంటి గుంతలో పన్ను పెరగడం మాత్రం వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు.

ఈ కేసు అధ్యయన సహ రచయిత డాక్టర్ మేఘనా తన్వర్ మాట్లాడుతూ.. “కంటి పైభాగంలోని సుపీరియర్ ఆర్బిట్‌లో ఎక్టోపిక్ టూత్ కేసు నమోదవడం ప్రపంచంలోనే ఇది మొదటిది, ఏకైక కేసు” అని వివరించారు.

సాధారణంగా జన్యుపరమైన సమస్యలు లేదా ముఖానికి తీవ్ర గాయాలు తగిలినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ బాలుడి విషయంలో అలాంటి చరిత్ర ఏదీ లేదని వైద్యులు తెలిపారు. అతని పుర్రెలో మరెక్కడా అదనపు దంతాలు లేవని, కేవలం యాదృచ్ఛికంగానే ఈ ఒక్క పన్ను తప్పుడు ప్రదేశంలో ఏర్పడిందని తేల్చారు.

అనంతరం వైద్యులు అతనికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ పన్నును తొలగించారు. దీంతో వాపు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా నివారించారు. ఈ కేసుపై డాక్టర్ తన్వర్ స్పందిస్తూ.. “ఇది మాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే తొలిసారి. ఈ కేసును చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం” అని వ్యాఖ్యానించారు.

Tags: A tooth in the eye… a rare occurrence in medical history… doctors left astonished!