పుంగనూరుముచ్చట్లు:
దసరా ఉత్సవాలలో భాగంగా ఏడవరోజు అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆదివారం పట్టణంలోని శ్రీభోగనంజుండేశ్వరస్వామి ఆలయంలో గల శ్రీపార్వతిదేవిని దుర్గాదేవిగా అలంకరించారు. శ్రీవిరూపాక్షి మారెమ్మను ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు. అలాగే బజారువీధిలో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవిని, తూర్పు మొగసాలలో గల శ్రీచాముండేశ్వరిదేవిని ప్రత్యేకంగా దుర్గాదేవి రూపంలో అలంకారించి కొలువుదీర్ఛారు.అలాగే మండలంలోని చదళ్ల గ్రామంలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారిని మహిషారసుర మర్ధిని అలంకారంలో కొలువుదీర్చి , భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లకు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Sri Durga Devi in the ‘Mahishasura Mardini’ alankara (adornment)