October 18, 2026
Explore
రాయచోటిలో నాలుగు మద్యం దుకాణాలకు రేపే దరఖాస్తుల చివరి రోజు

రాయచోటిలో నాలుగు మద్యం దుకాణాలకు రేపే దరఖాస్తుల చివరి రోజు

October 18, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మిగిలిన నాలుగు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులకు అక్టోబర్ 19 చివరి తేదీగా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

రాయచోటి రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఒక్కో దుకాణానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 21న మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. లైసెన్స్ పొందిన వారు ఏడాదికి రూ.60.50 లక్షల ఫీజుతో పాటు రూ.5 లక్షల పర్మిట్ రూమ్ ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుదారులు పూర్తి వివరాల కోసం రాయచోటి ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై. గురు ప్రసాద్ తెలిపారు.

Tags: Tomorrow is the final day to submit applications for four liquor shops in Rayachoti.